బట్టతల చిగురిస్తుందా?

Sun, 22 Jan 2012, IST    vv

మన సమాజంలో రకరకాల శిరోజాలున్న వ్యక్తులను చూస్తూ వుంటాం. బొద్దుగా, ముద్దుగా, నల్లటి సుడులు తిరిగి వున్న తలజుట్టు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. వారిని చూసి బట్టతల వున్న వ్యక్తులు బాధపడుతూ వుంటారు. నిజంగా చెప్పాలంటే బట్టతల ఒక జబ్బుకాదు. తరతరాలుగా బట్టతలలున్న వ్యక్తులున్నట్లు చరిత్ర ఆధారాలున్నాయి. మెక్సికోలోని కొండగుహల్లోని చిత్రకళాఖండాలే దీనికి నిదర్శనం. బట్టతల శాపం కాదు. కానీ, మనిషి సంతోషంగా దాన్ని స్వీకరించలేడు. దీని నివారణకు ఎన్నో చికిత్సలు, పద్ధతులు పూర్వం నుండే వున్నాయి. అనాది నుండి తీసుకుంటే, ఈజిప్టు రాజైన ఛాలౌను తల్లి 4000 బి.సి.లోనే బట్టతల నివారణకు పద్ధతుల్ని పేర్కొన్నదట. నల్లమందుకు లిల్లీ లేదా రోజాపువ్వుల సారాన్ని తీసి, సారాతో కలిపి తైలంగా వాడితే జుట్టు రాలిపోకుండా ఉంటుందని, నాలుగువందల బి.సి.లో హిప్పోక్రీట్‌ తెలిపాడు. రోమన్‌ పూర్వీకులు రేగిపండు సారాన్ని తీసి తలకు వాడటం ద్వారా బట్టతల రాకుండా జాగ్రత్తపడవచ్చని తెలిపారు. మొదటి బి.సి. కాలానికి చెందిన డిస్కోరిడిస్‌ పాములను నీటిలో వేడిచేసి, వచ్చే ద్రవాన్ని వారానికి రెండుసార్లు వాడితే జుట్టు రాలకుండా గట్టిపడు తుందని చెప్పాడు. రతి క్రీడలో ఎక్కువగా పాల్గొనడం ద్వారా బట్టతల వస్తుందని అరిస్టాటిల్‌ నమ్మకం! ఫ్రాన్స్‌ దేశస్థులు వ్యాపారరీత్యా పదినెనిమిదవ శతాబ్దంలో బట్టతల రాకుండా వుండేందుకు ఎన్నో మందుల్ని మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. బ్రిటన్‌కు చెందిన బార్టియట్‌ జనరేటర్‌ ద్వారా ఓ యంత్రాన్ని ఏర్పాటు చేసి, బట్టతలపైన లాగినట్లుగా ఒత్తిడిని కలుగజేసి, వెంట్రుకలు తలపైన మొలిపించేందుకు ప్రయత్నించాడు. జూలియస్‌ సీజర్‌, నెపోలియన్‌ వంటి వారికే బట్టతల వుంది. ప్రపంచాన్ని జయించాలన్న కోరిక వున్న అలగ్జాండర్‌ ది గ్రేట్‌ ఈ కోవకు చెందినవాడే. ఓ సందర్భంగా హిప్పోక్రేట్‌ ఇలా అంటాడు : నివబఅబషష్ట్రర సశీ అశ్‌ీ స్త్రతీశీష baశ్రీసు.

జుట్టు తరుచు రాలిపోవడం వల్ల బట్టతల ఏర్పడుతుంది. జుట్టు రాలటాన్ని రెండు రకాలుగా పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత మందులు వాడటం వల్ల, అనీమియా, టైఫాయిడ్‌వల్ల వెంట్రుకలు రాలటం ఒక రకానికి చెందినవి. గాయంవల్లగానీ, ఇతర మచ్చలవల్లగానీ తలవెంట్రుకలు రాలి పోవటాన్ని, రెండో రకానికి చెందినవిగా తెలిపారు. ప్రోగెస్టీరోన్‌, టెస్టోస్టీరోన్‌ అనే హార్మోన్‌ల లోపం వల్ల స్త్రీ, పురుషుల్లో బట్టతల ఏర్పడుతుంది. లిచెన్‌ ప్లానస్‌, డిస్‌ కోయిడ్‌ లూపస్‌, ఐధీ మాటోసఫ్‌ అనే జబ్బులవల్ల ఎలోపెసీయా, ఎరీటా అనే మచ్చలు ఏర్పడి జుట్టు రాలిపోతుంది. పై జబ్బుల ప్రభావం ముక్కు, తల, చర్మం, వేళ్ళపైన ఎక్కువగా వుంటుంది. కాన్సర్‌, కుష్టు, చుండ్రు రోగాల వల్ల జుట్టు రాలిపోతుంది. యాంటీ కాన్సర్‌ మందులు వాడడం వల్ల, ఐరన్‌ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. యాంటీ కోయాగులెంట్ల వల్ల అధికంగా జుట్టు రాలిపోతుంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల కూడా వుంది. ఇది పురుషుల్లో ఎక్కువగా వుంటుంది. ఇది తల మధ్యభాగంలో మొదలై, 'వి' ఆకారంలో ఆగిపోతుంది. డెర్మటాలిస్టులు జుట్టు పెరుగుదలకు మినోక్సిడల్‌ అనే మందును వాడమన్నారు. బి.పి. ఎక్కువగా వుండి, బట్టతల వున్నవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.

హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ వల్ల జుట్టును మొలకెత్తించవచ్చు. దీనికి ఎంతో డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. వెంట్రుకలు అంటూ కట్టడంలో సరైన దిశ లేకపోతే రకరకాలుగా మొలిచే అవకాశముంది. ట్రాన్స్‌ఫ్లాంట్‌కోసం, తల వెనుక భాగంలో వున్న చర్మాన్ని తీసి బట్టతల ప్రాంతంలో తిరిగి అంటుకట్టడం చేస్తారు. ప్రోటీన్లతో కూడిన ఆహారం, పోలిక్‌ యాసిడ్లు, విటమీన్‌ బి12లు జుట్టు రాలిపోకుండా కాపాడుతాయి. బట్టతల అందాన్ని దెబ్బతీయలేదు.

బట్టతల మనిషి ఆరోగ్యానికి హానికరంకాదు. బట్టతల బాధిత సంఘాలు బెల్టీస్‌ ఇంటర్నేషనల్‌ పేరిట మనదేశంలో కూడావున్నాయి. ఈ సంఘాలు బట్టతల వ్యక్తులకు సలహాలిస్తూ, వారి సమస్యల పరిష్కారంకు సూచనలిస్తూ వుంటాయట. సహజంగా వచ్చిన బట్టతలను గూర్చి మనిషి ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు. ఇన్‌ఫెక్షన్‌, రోగం, గాయాల వల్ల వచ్చిన బట్టతలకు సరైన చికిత్స పొంది జట్టును తిరిగి పొందవచ్చు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు