'మా మ్యూజికల్ అవార్డ్స్' ఫంక్షన్‌లో మంజు లారామస్వామి టీమ్ చేసిన క్లాసికల్ డాన్స్, దేవిశ్రీప్రసాద్ ఆటా పాటా, అనిరుధ్ పాడిన 'కొల వెరి...' పాట, శ్రీకృష్ణ-సునీతలు పాడిన వేటూరి క్లాసిక్స్, గీతామాధురి, ప్రణవి, శ్రీకృష్ణ, మాళవికలు పాడిన సిరివెన్నెల పాటలు ఆహూతులను ఆకట్టుకోగా, ఛార్మి డాన్స్, 'డియాలో డియాలో... 'పాటకు మరియమ్ జకారియా వేసిన స్టెప్పులు హుషారు పెంచాయి. 'సార్ వస్తారొస్తారా...' అంటూ స్వాతి ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. బాబా సెహగల్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూ గించారు. ఈ వేదికపై 'శ్రీరామరాజ్యం' యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. నందమూరి బాలకృష్ణ, నయనతారా, బాపు, యలమంచిలి సాయిబాబు, జొన్న విత్తుల, సమీర్‌ను కె.రాఘవేంద్రరావు, డా.డి.రామానా యుడు, పి.సుశీల, మా టీవీ చైర్మన్ ఎన్.ప్రసాద్‌లు సత్కరించారు. సాహిత్య ప్రపంచంలో తనదైన శైలిలో రాణిస్తున్న సిరివెన్నల ఇళయారాజా తరఫున యలమంచిలి సాయిబాబు అందుకు న్నారు. ఉత్తమ రచయితగా జొన్న విత్తుల, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా తమన్ ఎన్ని కయ్యారు. మ్యూజికల్ ఫిలిం ఆఫ్ ది ఇయర్‌కి గాను 'దూకు డు' నిర్మాతలు, డ్యాన్స్ నెంబర్ కొరి యోగ్రాఫర్‌గా ప్రేమ్‌రక్షిత్, బెస్ట్ సిం గింగ్ సెన్సేషన్‌గా స్వాతి, బెస్ట్ ఇన్‌స్పి రేషన్ సాంగ్ రచయితగా సుద్దాల అశోక్‌తేజ అవా ర్డులు స్వీకరించారు. ఈ వేడుకలో కె.విశ్వనాథ్, అల్లు అర వింద్, కె.అచ్చి రెడ్డి, గుణ్ణం గంగరాజు, ఎస్వీ.కృష్ణా రడ్డి, నందినీరెడ్డి, మణిశర్మ, చంద్ర బోస్, అమల, సుమంత్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, వరుణ్ సందేశ్, పుల్లెల గోపీచంద్ తదితరులు కూడా పాల్గొన్నారు. 'మా గోల్డ్ ఛానల్ ను ఇదే వేదికపై ప్రారంభించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
