అమేథీ : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిని, ఆమె ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారకర్త ప్రియాంక గాంధీ ఆది వారం ఎండగట్టారు. ఆమెను తీవ్రం గా విమర్శించారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం కావాలో, భవ నాల నిర్మాణం కోసం కోట్ల రూపా యల ప్రజా ధనాన్ని ఖర్చు చేసే ప్రభు త్వం కావాలో ప్రజలే నిర్ణయించు కోవాలని సూచించారు. ఐదు రోజుల యుపి పర్యటనలో భాగంగా నేడిక్కడ జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ మీ గురించి యోచించి, మీ కోసం పనిచేసే ప్రభు త్వం కావాలో, ప్రజలను విస్మరించి, భవనాల కోసం అనేక వేల కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు చేసిన ప్రభుత్వం కావాలో వయోజనులు నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. నాలుగవ విడత ఎన్నికలు ఈ నెల 19న ఈ జిల్లాలో జరగనున్నాయని, ఈ ఎన్నికలు మీ ప్రాంతానికే కాకుండా రాష్ట్రం, దేశా నికి కూడా ముఖ్యమైనవని తెలిపారు. నాయ కులను మీరే తయారు చేశారు, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒక నాయకురాలు మాత్రం ప్రజల కోసం ఆలోచించడం, సేవ చేయడం మానుకొని, మీరిచ్చిన అధికారాన్ని స్వార్ధానికి ఉపయో గించుకుంటున్నారని, అట్టి వారికి ప్రజలు మాత్రమే గుణపాఠం చెపు తారని ప్రియాంక వ్యాఖ్యానించారు. గత 22 సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్‌ను పాలించిన ప్రభుత్వాలు ప్రజలను అభివృద్ధి చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఎంత మేరకు అభివృద్ధి చెందిందో తనకు తెలుసునని, ఇక్కడ అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్రం, స్థానిక ఎంపిలు విడుదల చేసిన నిధులే కారణమని, ఇక్కడ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే వైపు నుంచి కానీ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదనేది వాస్తవమని ఆమె ఆరోపించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
