మరోసారి స్నేహ ఉల్లాల్‌ సంచలనం

Sat, 31 Mar 2012, IST    vv

స్నేహ ఉల్లాల్‌ తన అందాలతో మరో సారి సంచలనం సృష్టించబోతోంది. గతంలో ''లిక్‌'' అనే పేరుతో విడుదల చేసిన మీడియాకి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్య పోయిన స్నేహ అలాంటిదే మరొక వీడియా చేస్తున్నారు. మొదటి వీడియోకి దర్శకత్వం వహించిన శరత్‌ శెట్టి దీనికి కూడా పని చెయ్యనున్నారు.

ఈ నటి ప్రేక్షకుల దృష్టిని తన మీదకు త్రిప్పుకొనుట బాగా తెలుసుకుంది. చాలా రోజుల తరువాత విడుదల చేసిన ఈ చిత్రాలు ఇంటర్‌నెట్‌లో అద్బుత మయిన స్పందన కనబడింది. మీడియా కూడా ఈ మీడియో గురించి చాలా సార్లు ప్రస్తావించారు. స్నేహ ఉల్లాల్‌ ప్రస్తుతం అనిల్‌ సుంకర నిర్మాణం లో ఒక చిత్రం ఒప్పుకుంది. చూస్తుంటే ఈనటి తన కెరీర్‌ని మలుపు తిప్పుకోటానికి సరయిన దారినే ఎంచుకున్నట్టుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు