అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా...!

Tue, 10 Apr 2012, IST    vv

అరిటాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఖచ్చితంగా మంచే జరుగుతుందని పెద్దలు, వైద్యులు చెబుతున్నారు. ఆకుపచ్చని అరటి ఆకులో వేడి వేడిపదార్థాలను వేసుకుని భుజించటం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. మంచిగా ఆకలి కలుగుతుంది. ఆరోగ్యం చక్కబడి, శరీరానికి మంచి కాంతి వస్తుంది. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినటం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే మోదుగ ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తేజ్ఞాపకశక్తి పెరుగుతుందనీ, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటుంటారు. మహావిష్ణువు స్వరూపం అయిన మర్రిచెట్టు ఆకులలో అన్నం తింటే, క్రిమిరోగ నివారిణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. అరటి, మోదుగ ఆకులలో భోజనం చేయటం వల్ల ప్రేగులలోని క్రిములు నాశనం అవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అలాగే అరటి చెట్ల నుంచి లభించే అరటిపండు కూడా చాలా శ్రేష్టమైనది.

ఈ పండులో అత్యధికంగా లభించే పొటాషియం బీపీ, అధిక ఒత్తిడులను హరిస్తుంది. అరటిపండును రాత్రివేళల్లో పాలతోపాటు తీసుకుంటే చక్కగా నిద్రపడుతుంది. అరటిపండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు