విటమిన్-ఇ అధికంగా లభించే ''బాదం పప్పు'' ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు అందుతాయి. అది కూడా జీరో కొలెస్ట్రాల్‌తో. మాంసంలో ఉండే ప్రొటీన్లకు సమానమైన ప్రొటీన్లను అందించే బాదం పప్పులో ఏ మాత్రం కొలె స్ట్రాల్ ఉండదు. ఇక విటమిన్- ఇ రోజువారి దినచర్య లో శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా అడ్డుకుం టుంది. బాదం పప్పులో కాల్షియం, ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడితే... కాల్షియం ఎముకలు, పళ్లు కండరాలకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యాన్నిస్తుంది. అలాగే బాదంలో లభించే పొటాషియం, మెగ్నీషియంలు సక్రమమైన రక్తప్రసరణకు...శరీరంలో తయారైన శక్తిని కండరాలకు చేరవేసేందుకు చురుకైన పాత్రను పోషిస్తాయి. రోజుకు రెండు గుప్పెళ్ల బాదంపప్పు తింటే ఎలాంటి గుండె సంబంధిత జబ్బులు దరిచేరవని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది కూడా. బాదంలో హానికరమైన కొవ్వులేక పోవటం వల్ల వాటిని ఎంత మోతాదులో తీసుకున్నా, అనారోగ్యం దరి చేరదని... పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటా రని ఈ పరిశోధనల్లో బయటపడింది. బాదంలో అతి తక్కువ మోతాదులో లభించే సాచ్యురేటెడ్ కొవ్వువల్ల ఆరోగ్యంగా
ఉంటారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
