ఎగిరి గంతేస్తున్న ఈగ టీమ్‌

Fri, 6 Jul 2012, IST    vv
ఎగిరి గంతేస్తున్న ఈగ టీమ్‌

ఈగ చిత్రంకు హిట్‌ టాక్‌ రావడంతో సినిమా యూనిట్‌ సంబరాలలో మునిగి తేలుతోంది. శుక్రవారం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి ఆట చూసిన ప్రేక్షకులు సూపర్‌ అంటున్నారు. ప్రేక్షకుల ప్రశంసలతో ఈగ టీం ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్భంగా ఈగ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, కథానాయకుడు నాని, ప్రతినాయకుడు సుదీప్‌ మాట్లాడుతూ ఈగ సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చిందని రాజమౌళి అన్నారు. తమ్ముడు వారాహి చలన చిత్రం బ్యానర్‌పై మొదటిసారి సినిమా తీసి హిట్ట్‌కొట్టాడని దర్శకులు కీరవాణి అన్నారు. ఈ సినిమాకు ఇంతగా స్పందన రావడానికి అందరూ కారణమని నాని అన్నారు. సినిమాకు హిట్‌ టాక్‌ రావడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. సినిమాకు ఆదరణ బాగుందని సుదీప్‌ అన్నారు. కాగా రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' అంతటా భారీ ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పైరెండు కోట్లు వరకూ ఖర్చు అయింది. ఈగ సీన్స్‌ చిత్రీకరించటం కోసం రోబోని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో రోబోని నిజమైన ఈగ లాగా గ్రాఫిక్స్‌ సాయంతో మార్చారు. ఈ రోబోబ కోసం చాలా ఆధునికమైన పరికరాలు. ఇప్పుటి వరకూ తెలుగు పరిశ్రమ ఉపయోగించనవి వాడాల్సి వచ్చింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మీడియా, టీవీ ఛానెల్స్‌ అనే తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ లెవల్లో పబ్లిసిటీ చేశారు. రాజమౌళి నాని పాత్రలో నాని, ఇందు పాత్రలో సమంత నటించింది. మధ్యలో సుదీప్‌ పాత్ర ప్రవేశించి ఏం చేసిందనేది కథ. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి, స్టైలింగ్‌...రమారాజమౌళి, ఛాయా గ్రహణం.. సెంథిల్‌కుమార్‌, సమర్పణ డి.సురేష్‌బాబు


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు