నాధన్‌ మెక్‌కల్లమ్‌ 'ఆల్‌రౌండ్‌ షో'

Thu, 12 Jul 2012, IST    vv
మూడో వన్డేలో కివీస్‌ సంచలనం- రస్సెల్‌ పోరు వృధా
న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 249/9
వెస్టిండీస్‌ 34.3 ఓవర్లలో 161 ఆలౌట్‌
88 రన్స్‌తో కివీస్‌ గెలుపు

సెయింట్స్‌ కిట్స్‌ :నాథన్‌ మెక్‌కల్లమ్‌ (50,70 బంతుల్లో 4×4.1×6) అర్ధసెంచరీతో రాణించడంతోపాటు రెండు వికెట్లు తీసిఆల్‌ రౌండ్‌ షో ప్రదర్శించడంత ోపాటు ఓపెనర్‌ రాబ్‌ నికోల్‌ మరో అర్ధ సెంచరీతో (59, 69 బంతుల్లో 4×4, 3×6) అండగా నిలవగా, వాట్లింగ్‌ (40, 47 బంతుల్లో 4×4, 1×6) కూడా రాణించడంతో వెస్టిండీస్‌తో బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్‌ 88 పరుగులతో భారీ విజయం సాదింóచింది.దీంతో ఐదు వన్డేల సిరీస్‌ న్యూజిలాండ్‌ వెస్టిండీస్‌ ఆధిక్యతను 1-2 కు తగ్గించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 9 వికెట్లకు 249 పరుగులు చేయగా, ఒక మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ను బ్రెట్‌ బౌల్ట్‌, జాకబ్‌ ఓరం, నాథన్‌ మెక్‌కల్లమ్‌ రెండేసి వికెట్లతో దెబ్బతీయడంతో 34.3 ఓవర్లలోనే 161 రన్స్‌కు చేతులెత్తే సింది.విండీస్‌ బ్యాట్స్‌మెన్‌లె ఆండ్రీ రస్సెల్‌ (42 నాటౌట్‌, 24 బంతుల్లో 3×4, 4×6) మాత్రమే ధాటిగా ఆడగా, డెవాన్‌ స్మిత్‌ (19), పొల్లార్డ్‌(16), రామ్‌ధిన్‌ (14), గేల్‌ (11), ద్వానే బ్రేవో (2) విఫలమయ్యారు. తొలుత న్యూజిలాండ్‌ భారీ స్కోరు అవకాశాలను రస్సెల్‌ 57 రన్స్‌కే నాలుగు వికెట్లు తీసి దెబ్బతీశాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు