చాలా మంది స్త్రీలు ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ము ఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు.కానీ మెడ అందంగా పరి శుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖం అందం మీద కూడా పడుతుందని బ్యూటీగీషియన్లు అంటున్నారు. ముఖంతో పాటు మెడ అందం కూడా ముఖ్యమేనని వారు చెబుతున్నారు. ముఖంతో సమానంగా మెడ అందంగా ఉంచుకోవడానికి వారు కొన్ని పద్ధతులు సూచిస్తున్నారు. పసుపు, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకొని మెడకు పట్టించి పావు గంట పాటు అరనిచ్చి అనంత రం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్టయితే మెడ కూడా మంచి రంగుతో అందంగా కనపడుతుంది. ఏదైనా నూనెతో మెడను మసాజ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మసాజ్ కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా జరగడంతో పాటు మెడ మీద మడతల్ని కూడా కొంత వరకూ నివారించుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు మెడను మసాజ్ చేసుకుంటే ముఖంతో పాటు మెడను కూడా అందంగా ఉంచుకోవచ్చు. నిద్రపోయే సమయంలో తల కింద దిండు లేదా తలగడ లాంటివి పెట్టుకోకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో కొద్దిసేపన్నా మెడ ఎక్సర్‌సైజులు చేస్తే మంచిది. అయితే ఈ ఎక్సర్‌సైజులు నిపుణుల సూచనమేరకే చేయాలి. ఇంట్లో మీకు తోచిన విధంగా చేస్తే మెడ అందంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటి వలన మెడను తేలికగా ఎటువైపంటే అటు వైపు తిప్పడానికి వీలుంటుంది. పని ప్రదేశాలలో నిటారుగా కూర్చోవడం వలన నడుంకే కాకుండా మెడకి కూడా లాభమేనని నిపుణులు అంటున్నారు. మెడ అందంగా ఉండాలంటే కూర్చునే విధానం కూడా దోహదం చేస్తుందని వారు చెబుతున్నారు. బరువులు ఎత్తేటప్పుడు మోకాలు లేదా నడుం మీద ఎక్కువ బరువు వేయాలి. మెడ మీద బరువులు వేయకుండా ఉంటేనే మంచిది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
