రోగులపట్ల నిర్లక్ష్యధోరణిని సహించం

Fri, 3 Sep 2010, IST    vv
కలెక్టర్‌

ఖమ్మం (వి.వి) : ప్రభుత్వ ఆసుపత్రిలలో రోగుల పట్ల నిర్లక్ష్య దోరణీని సహించమని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంద ర్శించి హాస్పిటల్‌లో వున్న రోగుల సమస్యలను సిబ్బం దిని అడిగితెలుస ుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు నిత్యం వందలాది రోగులు వస్తుం టారని ఆసుపత్రి ఆవర ణతో పాటు అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచేందుకు సిబ్బంది దృష్టిసారించాలన్నారు. రోగుల పట్ల ప్రేమాభిమానంతో పాటు వైద్యం అందించాలన్నారు. హెచ్‌ఐవి పాజిటివ్‌ వార్డును, రక్తనమూనాలను సేకరించే ప్రయోగశాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఇసిటిసి పరీక్ష కేంద్రాన్ని సిడి 4కౌంట్‌ ల్యాబ్‌ ఆయన సందర్శించారు. రక్తనమూనా సేకరణ సందర్బంలో

బాధ్యతగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోగులకు వైద్య సేవలందిస్తూ వారి బాగోగుల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండాలన్నారు. సిబ్బంది పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో పనిచేసే సిబ్బంది నిర్లక్యంగా వ్యవహరిస్తున్నరనే ఆరోపణలు తన దృష్టికి వస్తున్నాయని సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు సిబ్బంది రోగుల పట్ల సహానం పాటించి వారి కలిగిన ఇబ్బందిని తీర్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త పాపాలాల్‌, సూపర్‌డెంట్‌ ఉషా, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శోభాదేవి, మెడికల్‌ అధికారి సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు