షాక్‌కు ఇద్దరు మహిళలు మృతి

Fri, 6 Apr 2012, IST    vv
షాక్‌కు ఇద్దరు మహిళలు మృతి

పెనుమూరు (వివి) : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని చిప్పారు పల్లి పంచాయతీలోని పాళ్యంకొ త్తూరు గ్రామంలో విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. వివరాలివి. పాళ్యంకొ త్తూరు గ్రామానికి చెందిన బుజ్జి (క్రిష్ణారెడ్డి) భార్య తులసి (32) గురు వారం ఉదయం బట్టలు ఉతికి ఆరబెట్టడానికి వెళ్లి పరలోకాలకు వెళ్లి పోయింది. ఇనుప తీగలు ఇంటి ముందర పెరటిలో పందిరి రాతకూ శానికి ప్రక్కలో ఉన్న చెట్టుకు ఇను పతీగను కట్టారు. అదేచెట్టుకు గ్రామంలో రంగా రెడ్డి అనే రైతు ప్రక్క లో ఉన్న పొలం దగ్గర ట్రాన్స్‌ ఫార్మర్‌ నుండి రంగారెడ్డి ఇంటి లోని వ్యవ సాయ బోరుకు కరెంటు వైర్లు ద్వారా తీసుకు వచ్చారు. బట్టలు ఆరబెట్ట డానికి చెట్టుకు కట్టిన కమ్మి, రంగారెడ్డి తీసుకున్న బోరు వైరు అతుక్కొని వుండడం దానిగుండా విద్యుత్‌ ఇనుపతీగకు సరఫరా కావడంతో అది తెలియని తులసి తడి బట్టలు ఆరవేయడానికి యధావిధిగా కమ్మిని పట్టుకోవడంతో షాకుకు గురై అక్కడే నిలబడి పోవడంతో ఇది చూసిన భాస్కర్‌రెడ్డి భార్య మల్లీశ్వరి (30) తులసిని కాపాడబోయి ఆమె కూడా షాక్‌కు గురై అక్కడికక్కడే ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఇది గమనించిన మరో వ్యక్తి తులసి మామ చిన్నబ్బరెడ్డి పోయి చూడగా ఆయనకు షాక్‌ తగలడంతో ఆయ్యో కరెంట్‌లో పడిపోయారని అరవ డంతో మరో మహిళ కర్రతో విద్యుత్‌ వైర్లను వేరు చేసింది. అనంతరం వెంటనే ఫోల్‌ దగ్గరకు వెళ్లి వైర్లు తొలగించి మహిళలను చికిత్స నిమిత్తం పెనుమూరు రంగారెడ్డి డాక్టర్‌ వద్దకు ట్రాక్టర్‌లో తీసుకురాగా డాక్టర్‌ పరిశీలించి ఇద్దరు చనిపో యారని నిర్థారించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆర్తనా ధాలతో గ్రామం నిండిపోయింది. తులసికి ఇద్దరు పిల్లలు కొడుకు చెందు, కుమార్తె శ్రీవల్లి ఇద్దరు చదువు కుంటున్నారు. మల్లీశ్వరికి పిల్లలు లేరు. కావున వారి కుటుంభం పిల్లలు వీధినపడ్డారని బోరున చుట్టు ప్రక్కల గ్రామాలైన గొబ్బిల్లిమిట్ట, చలంపాళ్యం, గుంటూరు వాండ్ల ఊరు, గాంధీపురం, పెనుమూరు తెలిసిన ప్రతి మహిళ పాళ్యం కొత్తూరులో విలపిస్తున్నారు. ఒకే గ్రామంలో పక్కపక్క ఇళ్లులు కావ డంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు