విజయవాడ (వి.వి) : విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విఎంసి ఉద్యోగులు, కార్మికులు గురువారం తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఉద్యోగుల జెఎసితో బుధవారం సాయంత్రం నుండి సుదీర్ఘ, చర్చలు జరిపారు. మరోప్రక్క ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో కూడా ఫోన్‌లో చర్చించారు. చివరకు మూడు నెలల్లో సమస్య పరిష్క రిస్తామని, తక్షణమే సమ్మె విరమిం చాలని ఉద్యోగులను కోరారు. అప్పటి వరకు ప్రతి నెలా 5వ తేదీ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, తర్వాత 010 ద్వారా జీతాలు చెల్లించే విధంగా ముఖ్యమంత్రిని ఒప్పించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే
ఉద్యోగులకు రావల్సిన పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ, టి.డి.ఎస్, పెన్షన్ ఫండ్, లేఅవుట్ డెవలప్‌మెంట్‌ఫండ్ వగైరా సమస్యలను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించగలమని హామీ ఇచ్చారు. దానిపై మూడు నెలల పాటు ఆందోళనను తాత్కాలికంగా విరమిం చేందుకు జెఎసి అంగీకరించింది. అయితే సిఐటియు నేతలు ఈ డిమాండ్లకు అంగీకరించక పోవడంతో జెఎసి నేతలు మరోసారి సమావేశమై సిఐటియును జెఎసి నుండి బహిష్క రిస్తున్నట్లు ప్రకటించారు. నెల రోజుల పాటు తమ ఆందోళనకు మద్దతు పలికిన అన్ని రాజకీయ పార్టీలకు, కార్మిక సంఘాలకు జెఎసి కన్వీనర్ ఈశ్వర్ ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
