విజయవాడ (వి.వి.): అఖిల భారత తపాల అదనపు ఉద్యోగుల (ఇడి) సంఘం రాష్ట్ర మహాసభ ఆదివారం విజయవాడలో నగరాల కళ్యాణ మండపం లో జరిగింది. రాష్ట్ర నలు మూలల నుండి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ మహాసభలో పాల్గొ న్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.వి. రావు, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. మహదేవయ్య, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రసం గిస్తూ 150 ఏళ్ళ చరిత్ర కలిగిన తపాలా శాఖలో గ్రామీణ ఉద్యోగుల పాత్ర శ్లాఘనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తపాలా ఉద్యోగులు విధి నిర్వహణ ఎలా వుంటుందో అందరికీ తెలిసిందేనన్నారు. తపాలా శాఖకు మూల స్తంభాలైన చిరుద్యోగుల వేతనాల దారుణంగా వున్నాయని, అదనపు పనిభారంతో కూడా వారంతా సేవలందిస్తున్నారని, వారికి వేతానలు పెంచడంలో, వారిని తపాలా శాఖ ఉద్యోగు లుగా గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇడి ఉద్యోగులకు తాపాల ఉద్యోగులతో సమా నంగా వేతనాలు, బోనస్ ఇవ్వాలని, చనిపోయిన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా పలు తీర్మా నాలు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్న దన్నారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
