కోల్‌కతా : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎపిజె అబ్దుల్ కలామ్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి తన ఫేస్‌బుక్ విజ్ఞప్తికి అద్భుతమైన స్పందన రావడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. కలామ్‌కు మద్దతు ప్రకటించిన వారిందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. 'కొద్ది సమయంలోనే తన విజ్ఞప్తికి అద్భుతంగా స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. దేశం కోసం అందరూ ఈ విధంగా స్పందించారు. ఈ అంశాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్ళేందుకు ఈ ఐక్యతా వాణి దోహదపడుతుంది' అని మమత పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు, సిద్ధాంతాలు విస్మరించడం పట్ల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. డబ్బు, అధికారం, కుంభకోణాలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజల ఆకాంక్షను తొక్కేస్తున్నట్లు ప్రజలు అభిప్రాయపడ్డారు. 'అతిగొప్ప భారతదేశంలో రాజకీయాలు విలువలు, ప్రజల ఆకాంక్షలను విస్మరించాయి. కేవలం డబ్బు, అధికారంతో తొక్కేస్తున్నారు. ఇది విచారకరం' అని మమత తన అధికారిక ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. నైతికపరమైన, సిద్ధాంతపరమైన రాజకీయాలు నేడు కనుమరుగయ్యాయని అభిప్రాయపడ్డారు. మీ వాణిని మరింత వినిపించాలని ఆమె దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి, దొడ్డిదారి ఒప్పందాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. మా వాణిని మరింత పెంచుతాం. సిద్ధాంతాలు, విలువలు, సమగ్రతకు కట్టుబడి పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
