తిమింగలాల గురించి మీరు విని
ఉంటారు. లేకుంటే పుస్తకాలలో చదివి
ఉంటారు. అదీ గాకపోతే సినిమాలలో చూచి ఉంటారు. గమనించండి! దాని ముందు భాగంలో ఉన్న ముక్కునుండి 'ఫౌంటెన్' లా నీళ్ళు చిమ్మినట్లు ఉంటుంది. ఎందుకని?
ఈ ప్రశ్నకు జవాబు తెలుసు కోబోయేముందు తిమింగలాన్ని గురించి కొంత తెలుసుకుందాం.
తిమింగలం చూడటానికి చేపలాగా
ఉంటుంది. నీటిలో మాత్రమే నివసిస్తుంది. కాని చేపకాదు. ఇదొక జంతువు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద 'డైనోసరస్' అనే భయంకరాకారం గల జంతువులు ఉండేవి. వాటి నుండే ఇవి ఏర్పడి ఉండవచ్చని అంటారు. ఇది పిల్లలను కంటుంది. పాలు ఇచ్చి పెంచుతుంది. అందువల్ల స్తన్య జాతికి చెందిన జంతువు. బాగా ఎదిగిన తిమింగలం 125 టన్నుల బరువు
ఉంటుంది. పొడవు 30 మీటర్లు పైన
ఉంటుంది.తోక వెడల్పు 6 మీటర్లు దాకా
ఉంటుంది. నాలుక బరువే 2 1/2 టన్నులట.
చేపల్లాగా దీనికి మొప్పలు లేవు. తలముందు భాగంలో ముక్కు ఉంటుంది. మనుషుల్లాగా ఊపిరితిత్తులు ఉంటాయి. శ్వాస పీల్చుకోవాలి కదా! అప్పుడు నీటిపైకి తల పెడుతుంది. అలా 5,10 నిమిషాల కొకసారి చేస్తుంటుంది. నీళ్ళల్లో మునిగి నప్పుడు ముక్కు రంధ్రాలు మూసు కుంటాయి. నోటి నుండి గాలి వెళ్ళే దారులూ మూసు కుంటాయి. మనం ఊపిరి పీలుస్తాం, విడుస్తాం. అలాగే ఇదీ చేస్తుంటుంది. గాలిపీల్చుకొని నీటిలో మునుగు తుంది. గాలి అయిపోగానే నీటిపైకి ముక్కు పెడుతుంది. ఊపిరి విడిచి పెడుతుంది. అప్పుడు పెద్ద శబ్దం అవుతుంది. దానితోపాటు ''ఫౌంటెన్'' లాగా నీరు చిమ్ముకువస్తుంది. అలా వచ్చినది లోపలున్న నీరు కాదు. నీటి ఆవిరి మాత్రమే! విడిచిన ఊపిరితోబాటు ఊపిరితిత్తుల్లో వేడెక్కిన నీటి ఆవిరి కూడా బయటకు వస్తుంది. అలా వచ్చీ రాగానే బయటి చల్లదనానికి నీటి తుంపరులుగా మారు తుంది. అదే మనకు నీరు చిమ్మినట్లు కనిపిస్తుంది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
