మనం ఆహారం భుజిస్తున్నాం. దానితోపాటు శరీరానికి కావలసిన పోషక పదార్థాలు' ఎన్నో లభిస్తున్నాయి. పోషక పదార్థాలతోబాటు కొన్ని ఆమ్లాలు కూడా శరీరంలో చేరుతున్నాయి. మనకు తెలియ కుండానే మేలు చేస్తున్నాయి. అటు వంటి ఆమ్లాలలో ''పోలిక్ ఆమ్లం'' ఒకటి. ఇది ఎక్కువగా ఆకు కూర లలో దొరుకుతుంది. కాబట్టి దీని కి ''ఫోలిక్ ఆమ్లం'' అని పేరు వచ్చింది. కాలేయం (జంతు సంబం ధమైన) లో కూడా ఈ ఆమ్లం ఉంటుంది.విటమిన్లలో బి12''కూ, ఈ ఆమ్లానికి అవినాభావ సంబంధం ఉన్నది దీనిలోపంతో రక్త హీనత' కూడా ఏర్పడుతుంది. ఇనుప ఖనిజ లవణం తగ్గితే ఎర్రరక్త కణాలలో ఉన్న ''హిమోగ్లోబిన్'' మాత్రమే తగ్గుతుంది. బి 12 ఫోలిక్ ఆమ్లాల లోపం వలన ఎముకలలోని 'మజ్జ'లో నుండి తయారై వెలువడే రక్తకణాల పెరుగుదలలో మార్పు వస్తుంది. అందుకని ఎర్ర రక్తకణాలు పెద్దవైపోతాయి. ఇదొక రకం రక్తహీనత .దీనినే ''మైక్రో నైటిక్ మెగలోబ్లాస్టిక్ ఎనిమియా'' అంటున్నారు. ఇది సూక్ష్మజీవుల ప్రభావం చేత ప్రేవులలో సృష్టించబడుతుంది. ఈ సూక్ష్మజీవుల పెరుగుదలకు పాలు తోడ్పడు తున్నాయి.గర్బిణీ స్త్రీలకు దీని అవసరం ఎంతో ఉన్నది. ఈ ఆమ్లాన్ని ఎక్కువ తీసుకుంటే పుట్టే శిశువు బరువు ఎక్కువ వుంటుందంటారు. గర్భిణీ స్త్రీలకు పాలు పడడానికి కూడా ఇదే కారణం. కాలేయంలో నిల్వచేయబడి ఉంటుంది. స్తన్యం ఇచ్చేటప్పుడు విడుదలవుతుంది. అందుకే గర్బిణీ స్త్రీలు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి అంటారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
