మెల్‌బోర్న్ : కాలిమడమ గాయం కారణంగా ఆస్ట్రేలియన్ 'స్టార్' పేసర్ బ్రెట్‌లీ భారత్, శ్రీలంకలతో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో శుక్రవారం జరిగిన రెండో టి-20లో చివరి ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా కుడికాలి మడ మకు గాయమైందని, ఎక్స్‌రే ప్రాక్చర్ అయినట్టుగా తేలిందని, దీంతో అతనికి ఆరు వారా లు విశ్రాంతి అవసరమని జట్టు ఫిజియో వెల్లడించారు.కాగా, ఆదివారం భారత్‌తో జరిగే తొలి వన్డే అనంతరం లీ స్థానంలో మరొకర్ని ఎంపిక చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
