వరుణుడిదే 'పైచేయి'!

Mon, 2 Jul 2012, IST    vv
ఆదుకున్న దిల్షాన్‌
శ్రీలంక ధీటైన జవాబు

కొలంబో : పాకిస్థాన్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక థీటుగా ప్రతిస్పందిస్తోంది. మూడో రోజు కేవలం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యంకాగా, పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 551/6 డిక్లేర్డ్‌కు సమాధానంగా బరిలోకి దిగిన శ్రీలంక ఆట ముగిపే సమయానికి ఒక వికెట్‌కు 70 పరుగులు చేసింది. ఓపెనర్‌ తరంగ పరనవితన పరుగులేమీ చేయకుండానే జునైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అవుటైనా మరో ఓపెనర్‌ దిల్షాన్‌ (46 నాటౌట్‌, 54 బంతుల్లో 9×4), వెటరన్‌ సంగక్కర (22 నాటౌట్‌, 24 బంతుల్లో 3×4) నిలకడగా ఆడి మరో వికెట్‌ కోల్పోకుండా అడ్డుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 4 వికెట్లకు 488 రన్స్‌తో తిరిగి బ్యాటింగ్‌ ప్రారంభించిన పాక్‌ మరో గంట అనంతరం ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.అప్పటికి కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ 66 రన్స్‌తో క్రీజ్‌లో వున్నాడు.లంక బౌలర్లతో హెరాత్‌కు మూడు వికెట్లు లభించగా, మాథ్యూస్‌, రణదీవ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. రెండో రోజు ఆటలో 44 ఓవర్లు వేయగా, మూడో రోజున కేవలం 27 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ సాధ్యమైంది. దాదాపుగా చివరి రెండు సెషన్లు వర్షం దెబ్బకు తుడిచిపెట్టుకు పోయాయి. మిగిలిన రెండు రోజులు కూడా వర్షం పడే అవకాశం వుండటమే ఈ టెస్టులో ఫలితం తేలడం కష్టంగానే కనిపిస్తోంది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు