ఈ ఓటమి చేదు గుళిక : స్ట్రాస్‌

Tue, 24 Jul 2012, IST    vv

లండన్‌ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్‌ 12 రన్స్‌తో ఎదురైన ఓటమి తమకు చేదు గుళిక వంటిదని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ వ్యాఖ్యానించాడు. టెస్టు ర్యాంకింగ్స్‌ తొలి రెండు స్థానాల్లో వున్న రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 'స్వదేశీ కండిషన్స్‌'లో తాము ఆధిక్యత ప్రదర్శిస్తామని భావించానని, అయితే దానికి విరుద్ధంగా సఫారీలు విజృంభించారని ఆయన పేర్కొంటూ, కనీసం 'డ్రా' చేసుకోలేకపోవడం విచారకరమని అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజున వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడంతో పట్టు కోల్పోయామని పేర్కొన్నాడు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు