మిక్స్‌డ్‌ 'కల' చెదిరింది!...పేస్‌, సానియా 'ఇంటిముఖం'

Sun, 5 Aug 2012, IST    vv

లండన్‌: టెన్నిస్‌లో ఒక్క పతకం సాధించకుండానే భారత బృందం ఇంటి ముఖం పట్టింది. ఇప్పటికే డబుల్స్‌లో పతకం ఆశలు కల్పించిన భూపతి- బొపన్న, పేస్‌- విష్ణు జోడీ పరాజయాలను మూటకట్టుకోగా, శనివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో పేస్‌, సానియా కూడా టాప్‌ సీడ్‌ బెలారస్‌ జోడీ మాక్స్‌ మిర్యాని, విక్టోరియా అజరెంకా చేతిలో 7-5, 7-6 (5) స్కోరుతో కంగుతినడంతో పరాజయం పరిపూర్ణమైంది. శుక్రవారం అర్ధంతరంగా నిలిచిన మ్యాచ్‌లో 5-7, 2-3తో వెనుకబడిన పేస్‌ జోడీ మొత్తంమీద గట్టి పోటీ యిచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు