హైదరాబాద్(వి.వి): ముఖ్యమంత్రి కె.రోశయ్య మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సతీమణి, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయలకిëకి శుక్రవారం లేఖ రాశారు. వైఎస్ కుటుంబానికి స్వాంతన కలిగించాలని, ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని భగవంతున్ని కోరారు. రాష్ట్రానికి, తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన ప్రియతమ నాయకుడు డాక్టర్ వై.ఎస్.ఆర్ దూరమై నేటికి ఏడాది గడుస్తుందని, చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తిని కోల్పోయి ఏడాది గడిచినా అప్పటి విషాదం నుంచి అభిమానులమే ఇంకా కోలుకోలేక పోతున్నామంటే, మీ కుటుంబానికి కలుగుతున్న దు:ఖం, ఆవేదన ఎంతగా కలిచివేస్తుంటాయో ఊహించగలనని రోశయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో, సంక్షేమ రంగంలో కొత్త వేగాన్ని సాధించిందని, అందుకే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఆయన సజీవంగా నిలిచిపోయారన్నారు. చరిత్ర విస్మరిం చడానికి వీల్లేని ఒక అసాధారణ ప్రజా నాయకుడు వై.ఎస్.ఆర్.అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయన సంస్మరణార్థం 'వై.ఎస్.ఆర్. స్మృతివనం' తదితర కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హెలికాఫ్టర్ దుర్ఘటనలో మరణించిన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి. సుబ్రమణ్యం, పైలెట్ సునీల్‌కుమార్ భాటియా, మరో పైలట్ ఎంఎస్ రెడ్డి, సిఎస్‌ఓ వెస్లీ సతీమణిలకు రాసిన లేఖలలో కూడా వారి వారి కుటుంబాలకు ప్రశాంత జీవనాన్ని కలిగించాలని రోశయ్య భగవంతున్ని కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
