హైదరాబాద్ (వివి) :మధ్య ఆదాయ, వేతనం పొందే వారికి ఉపయుక్తంగా ఉండే సరికొత్త యులిప్ సెలక్ట్ ఇన్సూ రెన్స్ ప్లాన్ కుటుంబానికి ఆర్థిక భద్రత, పెట్టుబడుల ద్వారా అధిక రాబడులు ఇస్తుందని ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ దీపక్ సూద్ తెలిపారు. హోటల్ తాజ్ డక్కన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కంపెనీ ఫ్చూచర్, ఇటలీకి చెందిన జనరలి కంపెనీతో కలిసి రాష్ట్రంలో ఇన్సూ రన్స్ వ్యాపారం చేస్తు న్నదని ఆయన చెప్పారు. ఐఆర్‌డిఏ మార్గదర్శకాల మేరకు తమ కంపెనీ రూపొందించిన నూతన పథకాన్ని ముంబైలో నిన్న ప్రారంభించామని, నేడు ఇక్కడ ప్రారంభిస్తున్నామని తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో మూడేళ్లుగా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. పాలసీదారుని అవస రాలకు అను గుణంగా నెలవారి చెల్లింపు ఆప్షన్, ఐదు ఫండ్ ఆప్షన్లు, భవిష్యత్తు అవసరాలకు ఫండ్, గరిష్ట ఈక్విటి సదుపాయం, భద్రతకోసం రైడర్ సదుపాయాలను కల్పిస్తామని దీపక్ తెలిపారు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అందుకునే దిశలో మార్కెట్ ఆధారిత లాభాలను పెట్టుబడి, బీమా రంగాలలో అందుకునే అవకాశాన్ని తమ కస్టమర్లకు అందిస్తామని తెలిపారు. ఈ ప్లాన్‌ను 7-60 సంవత్సరాల వయసున్న వారెవరైనా ఏడాదికి రూ. 18 వేల నుంచి 24 వేల ప్రీమి యంతో నెలకు లేదా ఆరు నెలల కొకసారి వినియోగదారులు 10-20 సంవత్సరాల కాలవ్యవధిలో కట్టవచ్చ న్నారు. చెల్లించిన ప్రీమియంలో 97 శాతం తొలి సంవత్సరంలోనే ఫండ్స్‌కు కేటాయి స్తామని, వార్షిక ప్రీిమియంపై 7-10 రెట్లు లభించే కనీస లైఫ్ కవర్ వినియోగదారుని వయసుబట్టి 25 రెట్లు ఉంటుందని, పాలసీ మెచ్యూ రిటీ తర్వాత ఫండ్ విలువ పాలసీ దారునికి చెల్లిస్తామని ఆయన వివరించారు.
పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తంతో పాటు ఫండ్ విలువ, మొత్తం చెల్లించిన ప్రీమియంలలో కనీసం 105 శాతం నామినీకి చెల్లిస్తామన్నారు.
యాక్సిడెంటల్ డెత్ కవరేజ్, అంగవైకల్యం కల్గితే, గార్డియన్ కవరేజ్, క్రిటికల్ ఇల్‌నెస్ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తామన్నారు. ఇవి కాకుండా పాలసీ మార్పు, పాక్షిక విత్‌డ్రాయల్, సరెండర్ ఆప్షన్లు, ఐదేళ్ల కాలపరిమితి, కేవలం 1-2 శాతం చార్జీలు 3.5 శాతం ఇన్సూరెన్స్ పేమెంట్ ఉంటుందని ఆయన వివరించారు. ఇన్సూరెన్స్ రంగంలో తమ వాటా పెంచుకునేందుకు రానున్న కాలంలో మరికొన్ని కొత్త ప్లాన్‌లు ప్రారంభిస్తామని దీపక్ తెలిపారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
