హైదరాబాద్, (వి.వి) : పులిచింతల ప్రాజెక్టును 2012కల్లా పూర్తి చేయటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని భారీ, మధ్యతరహా సాగునీటి శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిడిపి సభ్యులు రాజేంద్రప్రసాద్, చిగురుపాటి వరప్రసాద్, వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి, సింగారెడ్డిలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, ప్రభుత్వం జలయజ్ఞం క్రింద ప్రాధాన్యతనిచ్చి కొనసాగిస్తున్న ప్రాజెక్టులలో పులిచింతల ప్రాజెక్టు ఒకటన్నారు. ఈ ప్రాజెక్టును డిసెంబర్ 2012 కల్లా పూర్తిచేయటానికి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. దీనిపై సంతృప్తి చెందని సభ్యులు రాజేంద్రప్రసాద్ అనుబంధ ప్రశ్న వేస్తూ, మూడేళ్ళలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తిచేయలేదని, 2012లో కూడా పూర్తిచేస్తారన్న నమ్మకం లేదని, ఇది ఎప్పటికి పూర్తిచేస్తారో కచ్చితంగా చెప్పాలని ప్రశ్నించగా డిసెంబర్ 30 నాటికి0 వంద శాతం పనులు పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
