హైదరాబాద్ : భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 17వ వర్థంతి సభ ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు కొండాపూర్, సి.ఆర్. ఫౌండేషన్ ఆవరణలోని కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా మెమోరియల్ మీటింగ్ హాలులో జరుగుతుంది. ఈ సభలో సిపిఐ అగ్ర నాయకులు కామ్రేడ్ ఎ.బి.బర్ధన్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పువ్వాడ నాగేశ్వర రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి ప్రసంగిస్తారని సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి వి.చెన్నకేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
సి.ఆర్. ఫౌండేషన్ జనరల్‌బాడీ సమావేశం
ఈ నెల 9వ తేదీన జరగాల్సిన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ జనరల్‌బాడీ సమావేశం ఏప్రిల్ 12 తేదీ గురువారం మధ్యాహ్నం 2-00 గంటలకు సి.ఆర్. ఫౌండేషన్ ఆవరణలో కొండాపూర్ (హైదరాబాద్)లో సి.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షులు కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో సి.ఆర్. ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు కామ్రేడ్ ఎ.బి.బర్ధన్ పాల్గొంటారు. సభ్యులు సకాలంలో హాజరు కావాల్సిందిగా చెన్నకేశవరావు కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
