రైతు నేతల అరెస్ట్‌లను ఖండిస్తూ రాస్తారోకో

Wed, 18 Apr 2012, IST    vv

విజయవాడ (వి.వి) : వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆందోళన చేసిన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.రామకృష్ణను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం విజయవాడ రూరల్‌ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ఈసందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్నీడు యలమందరావు మాట్లాడుతూ పత్తి, పసుపు, మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా వుందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈఏడాది ధరలు రెండింతలు తగ్గాయన్నారు. ఈనేపధ్యంలో రైతుల పక్షాన పోరాడుతున్న రైతు సంఘం నేతలపై ప్రభుత్వం నిర్భంద చర్య లకు పాల్పడడం దారుణ మన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది వున్నా తక్షణమే గిట్టుబాటు ధరలు ఇప్పించడానికి చర్యలు గైకొనడంతో పాటు, రైతు సంఘం నేతలపై కేసులను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సి.పి.ఐ విజయవాడ రూరల్‌ మండల కార్యదర్శి యడ్ల కృష్ణకిషోర్‌, రైతు సంఘర నాయకులు ఉప్పలపాటి భారతమ్మ, కంపాల లక్ష్మయ్య, బొడ్డు వెంకటేశ్వరరావు, యాదల ప్రసాద్‌, టి.నాగరాజు, టి.శ్రీనివాసరావు, యు.నర్సింహారావు, కె.రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు