హైదరాబాద్(వి.వి) : అధిక ఫీజుల నియంత్ర ణకు చట్టం చేయాలని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) ఈనెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు నిచ్చింది. ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యాల యంలో ఆదివారం రాష్ట్ర నాయకులు ఎం.వేణు, టి.మనోహర్, వసంత బంద్‌కు సంబంధించి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలు కోసం, హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.1500 మెస్‌చార్జీలు పెంచాలని, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా వున్న ఉపాధ్యాయులు, ఎంఇఒల పోస్టులు భర్తీచేయాలని డిమాండ్ చేస్తూ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు.
రాష్ట్రంలో గుర్తింపు లేని విద్యాసంస్థలు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పేద విద్యార్థుల నుంచి డొనేషన్లు, అధిక ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. బంద్ జయప్రదానికి యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని వారు కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
