హైదరాబాద్ (వి.వి) : ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని, ప్రజలు పలు సమస్యలతో సతమతమ వుతున్నారని ఇబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. తమ పదవులు కాపాడుకునేందుకు మంత్రు లు, ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రయ త్నిస్తూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రజల ఓట్లతో అధికారంలో కి వచ్చిన నాయకులు వారి సమస్యలను విస్మరిస్తే ఏ విధంగా గుణపాఠం చెబుతారనడానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని ప్రభుత్వం, రాజకీయ పార్టీల నాయకులు గ్రహించి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని రవీందర్‌రెడ్డి కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
