హైదరాబాద్, (వి.వి): కార్పోరేట్ కళాశాలలను నియంత్రించాలని, తెలంగాణ ప్రాంతంలో విద్యను మరింత పటిష్టవంతం చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యాన ఇంటర్మీడియట్ బోర్డు వద్ద సోమవారం ధర్నా జరిగింది. దాంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు. విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. అనుమతులు లేని కళాశాలలను నిలిపివేయాలని, ఒక కళాశాలకు అనుమతి తీసుకుని, పలుచోట్ల కాలేజీలను నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్య పటిష్టానికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
