హైదరాబాద్, (వి.వి):రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు రైతు ధర్నా పేరిట రాజకీయం చేస్తున్నారని సిఎల్‌పి విమర్శించింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసా యమే దండగ అన్న నాయకుడు వ్యవసాయం, రైతులు అంటూ ధర్నాకు దిగి మహారాజు సీటులో కూర్చోవటం విడ్డూరంగా ఉందని సిఎల్‌పి ఉపనాయకులు వి.కిష్టారెడ్డి, శాసనమండలి సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి అన్నారు. పార్టీపై పట్టుకోల్పోయి దశాదిశ లేని పరిస్థితుల్లో తన విశ్వ సనీయతను కాపాడుకోవడానికి రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యా నించారు. సిఎల్‌పి కార్యాలయంలో సోమవారం వారు విలేక రులతో మాట్లాడారు. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కావలసినన్ని విత్త నాలు, ఎరువులను పంపిణీ చేయడం జరిగిందని, రైతులు తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేయాల్సి ఉందని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చిస్తుందని పొంగులేటి చెప్పారు. కౌలు రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందజేయాలని కూడ వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్ ఎస్ ఎస్ ఫీడ్స్
ట్విటర్ లో ఫాలో అవ్వండి
