నెట్కథలు...రెండు కప్పల కథ

Thu, 28 Jun 2012, IST    vv

ఓ కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులో నుండి రెండు కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడి పోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ రెండు కప్పలతో''మీరు ఇక బయటికి రాలేరు. ఒక వేళ బయటికి రావాలని ప్రయత్నించినా కిందపడి చని పోతారు. కాబట్టి అక్కడే

ఉండిపోండి.'' అన్నాయి.

ఆ రెండు కప్పలు మాత్రం వాటి మాటలు పట్టించుకోకుండా వాటి శక్తికొద్దీ బయటికి దుమకడానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దనీ, లోపలే ఉండిపోమ్మనీ అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసింది. కిందపడి చనిపోయింది. రెండోకప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్ని స్తుంది. పై నున్న కప్పల గుంపు ఇంకా రావద్దని, కిందపడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటికి వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ అసలు మేం అరుస్తుంటే విన్నావా;'' అని అడిగాయి. అప్పుడా కప్ప ''నాకు చెవుడు. మీరేం చెబు తున్నారో సరిగ్గా అర్ధం కాలేదు. కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్ధం అయింది. అందుకనే బయటకి రాగలిగాను'' అన్నది.


Share Email Print

జిల్లా వార్తలు

సైద్దాంతిక మాస పత్రిక

ఇతర సంచికలు