Friday, April 26, 2024
Friday, April 26, 2024

జోగమ్మపేట కేజీబివిను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్

జేవికే కిట్లుపై ఆరాతీసిన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వం అందజేసిన జగనన్న విద్యా కానుక కిట్లు గూర్చి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆరా తీశారు.శుక్రవారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని జోగమ్మపేట కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాటశాలవిధ్యార్థులకు అందజేసిన జగనన్న కిట్లలో పుస్తకాలు, బ్యాగులు, షూస్ గూర్చి ఆరాతీశారు. గతఏడాది కంటే ఈఏడాది బ్యాగులు బాగున్నాయని విధ్యార్థులు తెలిపారు.గతఏడాది అమ్మఒడి డబ్బులు అందరికీ అందాయా లేదాఆని ఆరాతీశారు.అంతా అందినట్లు తెలిపారు.విధ్యార్ధుల స్కిల్స్ గూర్చి ఆరా తీశారు. పలితాలు గూర్చి అడిగి మంచి పలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు.జిల్లా విద్యాశాఖఅధికారి ఎన్ ప్రేమ్ కుమార్, జి సి డి ఓ కె. రోజారమణి,సెక్టోరియల్ అధికారులతోపాటు మండల విద్యాశాఖాధికారులు సూరిదేముడు, మువ్వల వెంకటరమణ, కేజిబీవీ స్పెషల్ ఆఫీసర్ జొన్నాడ సంధ్య, కేజిబీవీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img